Couple | గోదావరిఖని టీజంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం

Couple | గోదావరిఖని టీజంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం

  • దంప‌తులకు తీవ్ర గాయాలు

Couple | గోదావరిఖని టౌన్, ఆంధ్ర‌ప్ర‌భ : స్థానిక మున్సిపల్ టీ జంక్షన్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం (Road Accident) జ‌రిగింది. గోదావరిఖని నుంచి కరీంనగర్ వైపు వెళుతున్న కారు ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న రామగుండం ట్రాఫిక్ సీఐ బి. రాజేశ్వరరావు పరిస్థితిని గమనించి వెంటనే స్పందించారు. గాయపడిన దంపతులనుస్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి తక్షణ వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో ప్రమాదానికి కారణమైన కారును, డ్రైవర్‌ను, టూవీలర్‌ను స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply