Knife attack in Japan : కత్తితో స్వైర విహరం Andhra Prabha Latest News

Knife attack in Japan : కత్తితో స్వైర విహరం Andhra Prabha Latest News
టైర్ ఫ్యాక్టరీలో రసాయన దాడి
15 మందికి తీవ్రగాయాలు
ఘాతకుడు అరెస్టు
( టోక్యో, ఆంధ్రప్రభ)
Knife attack in Japan | అమెరికాకు భిన్నంగా.. తుపాకీ కల్చర్ ను జపాన్ అసలు సహించదు. ఇప్పటికే ఈ దేశంలో తుపాకీ కట్టడికి కఠిన చట్టాలు ఉన్నాయి . అందుకే హింసాత్మక నేరాలు చాలా అరుదుగా జరుగుతాయి, కానీ ఇటీవల కాలంలో అనేక హై ప్రొఫైల్ కత్తి దాడులు పెరుగుతున్నాయి.

nife attack in Japan |
తాజాగా ఓ వ్యక్తి ఓ టైర్ ఫ్యాక్టరీలో ఊచకోతకు ప్రయత్నించాడు. కనిపించినోళ్లను కనిపించినట్టు (Knife attack) కత్తితో పొడిచాడు. సామూహిక నరమేధానికి దిగాడు. 8 మందిని ( 8 Stabbed) పొడిచాడు. రసాయన దాడికి (camicai attack) పాల్పడ్డాడు. ఈ దాడిలో మరో 7గురు తీవ్రంగా (7 Injured) గాయపడ్డారు. ఈ దాడిలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కానీ అదృష్టవశాత్తు క్షతగాత్రులందరూ ప్రాణాలతో బయట పడ్డారు.
ife attack in Japan |
ఘాతుకుడిని జపాన్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సెంట్రల్ జపాన్ టోక్యోకు పశ్చిమాన షిజువోకా ప్రిఫెక్చర్‌లోని మిషిమా నగరంలోని యోకోహామా టైర్ తయారీ (Tyre Factory) ఫ్యాక్టరీలోకి శుక్రవారం జపాను కాలమానం ప్రకారం సాయంత్రం 4.00 గంటలకు గ్యాస్ మాప్క్ తో వ్యక్తి ప్రవేశించాడు. సర్వైవల్ నైఫ్‌తో (Survival Kmife) 8 మందిని పొడిచాడు. తన వెంట తెచ్చుకున్న రసాయనాన్ని వెదజల్లాడు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ప్రాంతం హాహాకారాలతో దద్దరిల్లిపోయింది.

ife attack in Japan |
సాయంత్రం 4:25 నుండి 4:30 గంటల మధ్య పోలీసులకు సమాచారం అందింది. ఘటన స్థలికి చేరుకుని ఓ వ్యక్తికి అదుపులోకి తీసుకున్నారు. ఆగంతకుడు మాజీ ఉద్యోగిగా గుర్తించారు. నిందితుడు (Masaki oyama) మసాకి ఒయామా (38) ను అరెస్టు చేశారు. అతడు ఈ దాడికి ఎందుకు పాల్పడ్డాడో.. వివరాలు వెలుగులోకి రాలేదు. కత్తి పోట్లతో గాయపడిన ఎనిమిది మందిని ఆసుపత్రులకు తరలించామని, వీరిలో 5 గురు పరిస్థితి విషమంగా ఉందని ఫుజిసాన్ నాంటో అగ్నిమాపక విభాగం తెలిపింది.
ALSO rEAD : Bangla Tense : తారిక్ రీ ఎంట్రీ ..! Andhra Prabha Real News
