Kannada Heroines | ఆమోదయోగ్యం కాదు..
Kannada Heroines | ఆమోదయోగ్యం కాదు..
Kannada Heroines | కన్నడ హీరోయిన్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన కారణం ఏమిటి?
ఆషికా రంగనాథ్, సప్తమి గౌడ, రుక్మిణీ వసంత్ స్పందన
ఈవెంట్స్‌లో జూమ్ ఫోటోగ్రఫీపై తీవ్ర అభ్యంతరం
డ్రెస్సింగ్‌పై సోషల్ మీడియాలో చర్చ
మహిళా నటీమణులకు మద్దతుగా నిలుస్తామన్న హీరోయిన్స్
Kannada Heroines | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హీరోయిన్స్.. ఏదైనా ఫంక్షన్ కి వెళితే.. అక్కడ ఫోటో గ్రాఫర్లు ఫోటోలు తీయడం.. ఈ అందాల భామలు ఫోజులు ఇవ్వడం తెలిసిందే. అయితే.. ఈ ఫోటోలు ఒక్కోసారి సోషల్ మీడియాలో (Media) వైరల్ అవుతుంటాయి. ఇదిలా ఉంటే.. ఒక్కోసారి కొంత మంది ఈ హీరోయిన్స్ ని అభ్యంతకరమైన రీతిలో ఫోటోలు తీయడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తుంటారు. దీని పై ముగ్గురు కన్నడ భామలు ఫైర్ అయ్యారు. తమ స్పందనను సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. ఇంతకీ.. ఆ ముగ్గురు భామలు ఎవరు..? వాళ్లు ఏమన్నారు..?
Kannada Heroines | ఆషికా, సప్తమి, రుక్మిణీ..
హీరోయిన్స్ (Heroines) ఏదైనా ఫంక్షన్ కి వెళితే.. కొంతమంది జూమ్ చేసి మరీ.. ఫోటోలు తీస్తుంటారు. దీని గురించి హీరోయిన్స్ పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు. అయితే.. ముగ్గురు కన్నడ భామలు దీని పై మాట్లాడారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే.. ఆషికా రంగనాథ్, సప్తమీ గౌడ, రుక్మిణి వసంత్. ఈ ముగ్గరు.. ఇన్ స్టా ద్వారా తమ వాయిస్ ను వినిపించారు. ఈవెంట్స్ కు వెళ్లినప్పుడు పదే పదే నటీమణుల ఫోటోలు, వీడియోలను అనుచిత కోణాల్లో చిత్రీకరించి ప్రసారం చేస్తున్నారు. మేము చేసే పని కంటే మా శరీరాల పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు.

Kannada Heroines | జూమ్ చేసి మరీ..
ఇటీవల హీరోయిన్స్ డ్రెస్సింగ్ గురించి హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో శివాజీ మాట్లాడడం.. అది వివాదస్పదం అవ్వడం తెలిసిందే. ఇక అక్కడ నుంచి హీరోయిన్స్ డ్రెసింగ్ (Dressing) గురించి చర్చ నడుస్తూనే ఉంది. అయితే.. కొంత మంది హీరోయిన్స్ ఇలా జూమ్ చేసి మరీ.. ఫోటోలు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ.. డ్రెస్సింగ్ బాగుంటే.. పద్దతిగా చీర కట్టుకుని వస్తే.. ఇలాంటి పరిస్థితులు రావు కదా అని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. అందాలు ఆరబోసేలా.. కుర్రకారును రెచ్చగొట్టేలా.. డ్రెస్సు్లు వేసుకుని ఆతర్వాత మా ఫోటోలు అసభ్యకరంగా తీసారని బాధపడడం ఎందుకు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

Kannada Heroines | ఖండిస్తున్నాం..
అయితే.. కళ కోసమే ఇక్కడ ఉన్నాం.. మా జూమ్ ఇన్ ఫోటోలు అనుచిత కోణాల్లో తీయడాన్ని ఖండిస్తున్నాం.. ఇలాంటి చర్యలను సహించలేం. వీటిని ఖండిస్తున్నామని కన్నడ (Kannada) భామలు ఆషిక రంగనాథ్, సప్తమి గౌడ, రుక్మిణీ వసంత్ తెలియచేశారు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే ప్రతి మహిళా నటితో మేము నిలబడతాం. మేము ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటాం అన్నారు. మరి.. ఈ ముగ్గురు భామల స్పూర్తితో మరి కొంత మంది భామలు ఈ విషయం పై మాట్లాడతారేమో చూడాలి.
