Celebrations | ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Celebrations | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని దండేపల్లి, మ్యాదరిపేట, గ్రామాల్లో గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా చర్చిలను రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేసి ఉదయం నుండి మహిళలు వారి ఇంటి ముందు రంగుల ముగ్గులు వేసుకుని పండుగను జరుపుకున్నారు. చర్చి ఫాద‌ర్ తో కలిసి యేసు క్రీస్తు బోధనలతో వాడవాడలా డీజే పాటలతో టపాకాయలు కాలుస్తూ క్రైస్తవులు సంబరాలు చేసుకున్నారు. చర్చిలల్లో ప్రత్యేక పూజలు చేస్తూ భజనలు చేశారు. కొంతమంది క్రైస్తవ సోదరులు కేకులు కట్ చేశారు. క్రిస్టియన్ మత గురువులు యేసు ప్రభు జన్మదిన సందర్భంగా ఆయన ప్రాధాన్యత గురించి వారికి వివరించారు. అనంతరం చర్చిల వద్ద అన్నదానం నిర్వహించి క్రిస్మస్ పండగను జరుపుకున్నారు.

Leave a Reply