China Manja | చైనా మాంజాపై ఆంక్షలు

China Manja | చైనా మాంజాపై ఆంక్షలు

  • విక్రయించిన, వినియోగించిన జైలుశిక్ష తప్పదు
  • వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వార్నింగ్

China Manja | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : పక్షులతో పాటు, ప్రజలకు ప్రమాదకరంగా మారిన చైనా మాంజాను ఎవరైనా విక్రయించినా, వినియోగించినా వారి పట్ల కఠినంగా వ్యవహారిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్(Police Commissioner) సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు.

సంక్రాతి పండుగ సమీపిస్తున్న వేళ యువత గాలి పటాలను ఎగురవేసేందుకు పోటీపడతారన్నారు. కానీ పతంగులు ఎగురవేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో యువత అధికంగా చైనా మాంజా(China Manja) ఉపయోగించి గాలి పటాలను ఎగుర వేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. కాని యువత వినియోగించే చైనా మాంజా (సింథటిక్ దారం, గాజు పొడి) చాలా ప్రమాదకమని ఎత్తి చూపారు.

ఈదారాన్ని ఉపయోగించడం ద్వారా పక్షుల గొంతులు, పక్షుల రెక్కలు తెగిపోవడం, మనుషులకు గాయాలు కావడం జరుగుతుందన్నారు. ఎవరైనా చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ఇది చట్ట విరుద్ధమని హెచ్చరించారు.

ఈ చైనా మాంజా నియంత్రణ(Control)కై ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే టాస్క్ ఫోర్స్ పోలీసులు, హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమార్ పల్లి ప్రాంతంలో ఆనంద్ అనే వ్యక్తి ఇంటిపై దాడి చేసి సూమారు రూ.2 లక్షల(Rs. 2 lakh) 3 వేల విలువైన చైనా మాంజాను స్వాధీనం చేసుకోన్నారన్నారు.

ఎవరైనా చైనా మాంజా విక్రయాలకు పాల్పడితే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలకు సూచించారు. చైనా మాంజా వినియోగించి పతంగులు ఎగురవేసే వారి చేతులు కూడా కట్ అయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. చైనా మాంజా వాడటం మానుకోవడం అన్నీ విధాలా ఉత్తమమని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు.

Leave a Reply