Bangla Ban | అవామీ లీగ్ నిర్వీర్యం..
Bangla Ban | అవామీ లీగ్ నిర్వీర్యం ..
ఆంధ్రప్రభ, కోల్కతా :

Bangla Ban : బంగ్లాదేశ్ తాత్కలిక ప్రభుత్వం .. ఇక్కడి ప్రధాన రాజకీయ పార్టీకి చావు దెబ్బ కొట్టింది. త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయటానికి వీలులేకుండా.. (Bngla Ban) అవామీ లీగ్ పార్టీకి (Avami League Party) బ్రేక్ వేసింది. తాజా పరిణామం అంతర్జాతీయంగా కీలక మలుపు (Twist) తిప్పుతోంది. 2024లో విద్యార్థుల నిరసనల తర్వాత, ఉగ్రవాద నిరోధక చట్టం కింద మాజీ ప్రధాని షేక్ హసీనా ( Ex PM Hasina) నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీ కార్యకలాపాలను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నిషేధించింది.

మే 2025లో ఆ పార్టీ కార్యకలాపాలన్నింటినీ (Baned) నిషేధించింది. ఫిబ్రవరి 2026 ఎన్నికలలో అవామీ లీగ్ పార్టీ పాల్గొనకుండా తాజాగా నిషేధించింది. ఈ నిషేధానికి కారణాలేంటంటే.. ఉద్యోగ కోటాకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు, అవామీ లీగ్ ప్రభుత్వ అణచివేతతో హింసాత్మక రూపం దాల్చాయి, ఇది హసీనాను పదవీచ్యుతురాలిని చేయడానికి దారితీసింది . ఆగస్టు 2024లో పదవి నుంచి తొలగించబడిన తర్వాత, ఆమె దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది.
Bangla Ban : ఉగ్రవాద నిరోధక (Anti-Terrorism Act) చట్టాన్ని సవరించి, అవామీ లీగ్ , అనుబంధ సంస్థలను అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ విచారణ పూర్తయ్యే వరకు నిషేధించారు. తాజాగా ఫిబ్రవరి 2026లో జరగబోయే ( Election) ఎన్నికలలో అవామీ లీగ్ పాల్గొనడంపై నిషేధం (No Participation) కొనసాగుతోంది.

చాలా మంది అవామీ లీగ్ నాయకులు దేశంలో లేరు లేదా జైళ్లలో ఉన్నారు, మధ్యంతర ప్రభుత్వం వారిని వేటాడుతోంది. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ , పార్టీని ఒక సంస్థగా విచారించడానికి వీలుగా చట్టాన్ని సవరించింది. మొత్తంగా, షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీ రాజకీయంగా తీవ్ర ఒత్తిడిలో ఉంది, పార్టీ కార్యకలాపాలు నిలిచిపోయాయి ఇక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదుఎన్నికల్లో పోటీకి నో
ALSO READ : Bangladesh Unrest : హింసాకాండ
