Brutal murder | మహిళా దారుణ హత్య

Brutal murder | ఆస్పరి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని తొగలగల్లు గ్రామంలో మహిళ అర్ధరాత్రి దారుణ హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది. తొగలగల్లు గ్రామంలో గత నెల సెప్టెంబర్ 3వ తేదీన అహోబిలం (32) హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో తన భార్య గంగావతి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని, తన భర్తను తానే ప్రియుడుతో చంపించిందని, పోలీసు వారు పూర్తి స్థాయి విచారణ అనంతరం గంగావతిని సెప్టెంబర్ 8వ తేదీన రిమాండుకు పంపించారు. గంగావతి రిమాండ్ నుండి అక్టోబర్ 28వ తేదీన బెయిల్ పై బయటకు వచ్చింది. బెయిల్ నుండి తిరిగి వచ్చిన తను భర్త ఊరిలోనే తన ఇంటిలో నివాసం ఉండేది. అయితే.. నిన్న అర్ధరాత్రి దాదాపుగా 10:30 నిమిషాలకు తన భర్త తమ్ముడు పెద్దయ్య తన అన్న చావుకు కారణమైన వదిన పై కసి పెంచుకొని నిద్రిస్తున్న గంగావతి తల పై రోకలి బండతో ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో గంగావతి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఆస్పరి సీఐ గంగాధర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. సమాచారాన్ని జిల్లా స్థాయి అధికారులకు తెలియజేసినట్లు వారు తెలిపారు.

Leave a Reply