Sukma | ఆయుధ కర్మాగారం ధ్వంసం

Sukma | ఆయుధ కర్మాగారం ధ్వంసం
Sukma | ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రభ : ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఇప్పటికే ఆపరేషన్ కగార్ (Operation Kagar) తో కకావికలమైన మావోయిస్టుల (Maoists) కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లా (Sukma district) లోని మావోయిస్టుల ఆయుధ కర్మాగారాన్ని భద్రతాబలగాలు, పోలీసులు సంయుక్తంగా ధ్వంసం చేశారు. దాంతో అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కుట్రను భగ్నంచేశారు. సుక్మా జిల్లా మీనాగట్టా (Meenagatta) అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలతోపాటు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మావోయిస్టులు నిర్వహిస్తున్న ఆయుధ తయారీ కేంద్రాన్ని భద్రతాబలగాలు గుర్తించాయి. అందులో భారీ ఎత్తున ఉన్న ఆయుధాలను, సింగిల్ షాట్ రైఫిల్స్‌ను, డిటోనేటర్ల (Detonators) ను, భారీ పేలుడు పదార్థాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. అలాగే భద్రతాదళాలే లక్ష్యంగా బాంబుల తయారీకి సంబంధించిన మెటీరియల్‌ను సైతం వారు పేల్చేశారు.
