POLICE | మత్తు రవాణా అరికట్టడమే లక్ష్యం

POLICE | మత్తు రవాణా అరికట్టడమే లక్ష్యం

  • గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్
  • జిల్లా వ్యాప్తంగా నాకాబందీ
  • 603 కేసులు నమోదు…
  • రూ.4.27 లక్షల జరిమానా

POLICE | గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణాతో పాటు ఇతర నేరాలను అరికట్టే లక్ష్యంతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు విస్తృతంగా నాకాబందీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు రాత్రి ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నాకాబందీ కార్యక్రమంలో భాగంగా మొత్తం 603 కేసులు నమోదు చేసి, రూ.4,27,832 జరిమానా విధించారు. అదే విధంగా 31 అనుమానిత వాహనాలను సీజ్ చేశారు.

POLICE

నాకాబందీ సమయంలో అనుమానిత వ్యక్తులు, అనుమానాస్పద వాహనాలను ఆపి సమగ్ర తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్ తదితర ధ్రువ పత్రాలను పరిశీలించారు. అలాగే ప్రయాణ మార్గం, ఉద్దేశం, గమ్యస్థానం గురించి ఆరా తీసి అవసరమైన చోట్ల హెచ్చరికలు జారీ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారు, వాహన ధ్రువపత్రాలు లేని వారిపై కేసులు నమోదు చేశారు. పెదనందిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 131 క్వార్టర్ బాటిళ్ల మద్యం సీసాలను పోలీసులు సీజ్ చేసి, వాటిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

POLICE

Leave a Reply