1999-2000 batch | ఒకే వేదికపై కలిసిన పూర్వ విద్యార్థులు..

1999-2000 batch | ఒకే వేదికపై కలిసిన పూర్వ విద్యార్థులు..

1999-2000 batch | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో ఈ రోజు 1999-2000 బ్యాచ్‌(1999-2000 batch) పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ రోజు సందడిగా సాగింది. ఎనిమిది నెలల కాలంలోనే వీరంతా రెండోసారి కలవడం విశేషం. సింగపూర్‌లో ఉంటున్న మిత్రురాలు రావడంతో మిత్రులంతా మరోసారి ఒకచోట చేరి ఆత్మీయంగా(sincerely) గడిపారు.

చిన్ననాటి ముచ్చట్లు, పాఠశాల రోజులను గుర్తుచేసుకుంటూ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా మిత్రుల మధ్య అనుబంధాన్ని చాటేలా కేక్‌ కట్‌ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు..

Leave a Reply