మేడారంలో సీఎం తులాభారం

మేడారంలో సీఎం తులాభారం
ఉమ్మడి వరంగల్ బ్యూరో, ఆంధ్రప్రభ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారాలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకొని అమ్మవార్లకు నిలువెత్తు బంగారు బెల్లం సమర్పించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 68 కిలోల బరువు తూగారు. మేడారం పర్యటనలో భాగంగా సీఎం అమ్మవార్లకు బంగారు(Bangaru) (బెల్లం) సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన తూకంలో కూర్చొని లెక్కేశారు. సీఎం 68 కిలోల బరువు ఉండటంతో అంతా బెల్లం అమ్మవార్లకు సమర్పించారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళగా పిలవబడుతున్నమేడారం సమ్మక్క సారలమ్మ(Medaram Sammakka Saralamma) మహాజాత జాతరను ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగానే అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు వనదేవతలైన సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంత్రులు పొంగులేటి(Ponguleti), సీతక్క, కొండా సురేఖ(Konda Surekha), అడ్లూరి లక్ష్మణ్‌తోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎంపీ బలరాం నాయక్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య తదితరులతో జాతర నిర్వహణ, కొత్త నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు.
