Mud mound | యతెచ్చాగా మట్టి తరలింపు..

Mud mound | యతెచ్చాగా మట్టి తరలింపు..

  • రాత్రి, పగలు తేడా లేకుండా సాగుతున్న దందా..
  • ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కులు..

Mud mound | వెల్దండ, ఆంధ్రప్రభ : ప్రకృతి పరంగా ఏర్పడిన మట్టి గుట్టల(Mud mound)పై అక్రమార్కుల కన్ను పడింది. ఇదే అదునుగా భావించిన కొందరు అనుమతులు పొందకుండా గుట్టలను కొల్లగొడుతున్నారు. వెల్దండ మండలం కొట్ర గేటు సమీపంలో ఉన్న పెట్రోల్ బంకు(Petrol station) వెనుకాల గల గుట్టనుంచి జేసీబీ సాయంతో టిప్పర్లలో మట్టిని తరలిస్తున్నారు.

ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయాల్టి డబ్బులు చెల్లించకుండానే మట్టిని మాయం చేస్తూ భారీగా దండుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కల్వకుర్తి పట్టణానికి చెందిన భీమయ్య అనే వ్యక్తి అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు సమాచారం.

ఈ విషయంపై తహసిల్దార్(Tehsildar) కార్తీక్ కుమార్ ను ఫోన్ లో సంప్రదించగా స్పందించిన ఆయన మట్టి తరలించే ప్రదేశానికి సిబ్బందిని పంపించారు. రెవెన్యూ అధికారులు వస్తున్న సమాచారం తెలుసుకున్న జెసిబి, టిప్పర్ డ్రైవర్లు వాహనాలతో అక్కడి నుండి ఊడయించారు.

Leave a Reply