Pulse Polio Drops | కలెక్టర్ కొడుకుకు పోలియో చుక్కలు

Pulse Polio Drops | కలెక్టర్ కొడుకుకు పోలియో చుక్కలు
Pulse Polio Drops | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ (Vinod Kumar) 13 నెలల ద్వితీయ కుమారుడు భెవిన్ చిరాయు విభుకు బాపట్ల పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు ఏరియా ఆసుపత్రి నిర్వహిస్తున్న పల్స్ పోలియో 0.5 కార్యక్రమంలో పోలియో చుక్కలు వేయించారు. కలెక్టర్ స్వయంగా ఏరియా ఆసుపత్రి కేంద్రంకు కుటుంబసమేతంగా వచ్చి వారి అబ్బాయికి పోలియో చుక్కలు వేయించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ విజయమ్మ, ఆర్డీవో గ్లోరియా, తహసీల్దార్ సలీమా, ఏఎన్ఎం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

