CP Sajjanar | టాస్క్ ఫోర్స్ ప్రక్షాళన..

- ఒకే సారి 80 మందికి షాకిచ్చిన సీపీ
హైదరాబాద్ నగర టాస్క్‌ఫోర్స్ విభాగంలో భారీ ప్రక్షాళనకు తెరలేపుతూ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణలు, విధి నిర్వహణలో లోపాల నేపథ్యంలో ఒకేసారి 80 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందులో ఎస్ఐ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు ఉన్న అధికారులందరినీ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేయడం ఇప్పుడు పోలీసు శాఖలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవలి కాలంలో టాస్క్‌ఫోర్స్ అధికారులపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో విభాగంపై ప్రత్యేక దృష్టి సారించిన సీపీ, వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఈ భారీ బదిలీలకు శ్రీకారం చుట్టారు.
నగర పోలీసు విభాగంలో క్రమశిక్షణను పెంచడానికి, ప్రతిష్ఠను కాపాడటానికి సీపీ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర విభాగాల్లో కూడా చర్చనీయాంశమైంది.
