Parliament | కార్టూన్..

Parliament | కార్టూన్..

ఆంధ్ర‌ప్ర‌భ : అధికార-ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చల మధ్య పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. డిసెంబర్ 1న ప్రారంభమైన ఈ సమావేశాలు నిర్ణీత గడువు ముగియడంతో ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.

ఈ సమావేశాల్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కీలకమైన ‘వీబీ- జీ రామ్ జీ’ బిల్లుపై చర్చ కోసం ఎంపీలు రాత్రి వేళల్లో కూడా సభలోనే గడిపారు. దీనివల్ల లోక్‌సభ 111 శాతం, రాజ్యసభ 121 శాతం ఉత్పాదకతను నమోదు చేయడం విశేషం.

ప్రధాని మోదీ సభలో ఉన్న సమయంలోనే కొందరు సభ్యులు ‘మహాత్మాగాంధీకీ జై’ అంటూ నినాదాలు చేయడం, జాతీయ గేయం వందేమాతరంపై వాడీవేడిగా చర్చ జరగడం ఈ సమావేశాల్లో ప్రధానంగా నిలిచాయి.

మొత్తం 8 కీలక బిల్లులు ఉభయ సభల ఆమోదం పొందాయి. అయితే, వాయు కాలుష్యంపై చర్చ జరగాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల అది వీలుపడలేదు.

Sonia Gandhi | మోడీ స‌ర్కార్ పై సోనియా గాంధీ ఫైర్

Leave a Reply