IndiGo Crisis | అయ్యో ఇండిగో Andhra Prabha SPL story
IndiGo Crisis | అయ్యో ఇండిగో Andhra Prabha SPL story
- మదుపర్లు అయ్మో రామా
- ఇక లాభాల బ్యాగులు డొల్లా
- మితిమీరిన శ్రమతోనే కష్టంఇప్పటికి ₹ 2000 కోట్ల నష్టం
IndiGo Crisis | న్యూస్ నెట్ వర్క్, ఆంధ్రప్రభ : భారతదేశంలోని.. బహు చౌక విమానయానం అందించే.. అతిపెద్ద లో-కాస్ట్ ఎయిర్ లైన్ ఇండిగో (IndiGo Crisis ) ప్రస్తుతం సంక్షోభంలో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. FY25 లో ₹7,258 కోట్ల ప్రాఫిట్ బ్యాగులో వేసుకున్న ఇండిగో.. ఇప్పుడు చేజేతులారా నష్టాన్ని మూటగట్టుకుంటోంది. గత వారం రోజులుగా.. 3800 విమాన సర్వీసులు రద్దు చేసింది. ₹ 600 కోట్లు పైగా నష్టపరిహారాన్ని భుజానికి ఎత్తుకుంది.
IndiGo Crisis

ఇటు క్రిస్ మస్.. అటు సంక్రాంతి.. వింటర్ వెకేషన్స్.. పండుగలొస్తున్నాయి. మరో వైపు పెళ్లిళ్ల సీజన్ హారన్ మోగుతోంది. ఈ స్థితిలో విమానాలను నడపటానికి ఇండిగో నానా తంటాలు పడుతోంది. ఈ ఎఫెక్టు ఇప్పటి వరకూ విదేశీ సర్వీసులపై పడలేదు. ఫిబ్రవరి వరకూ ఈ సంక్షోభానికి తెరపడదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసలు భారతీయుల్లో విమానయానంపై మరింత ఆసక్తి పెంచిన ఇండిగో.. అకస్మాత్తుగా.. ఢీలా పడటానికి కారణాలేంటీ..
గత 20 ఏళ్ల చరిత్రలోనే ( 20 Years History) ఇంత పెద్ద సంక్షోభం నుంచి ఇండిగో ఎప్పట్లో కోలుకుంటుంది? ఈ లోపు ఇండిగో టర్నోవరు ఇతర విమానయాన సంస్థలకు దక్కుతుందా? ఈ పోటీ ప్రపంచంలో ఈ ఇండిగో సంస్థ తట్టుకోగలదా? అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.
IndiGo Crisis | సంక్షోభానికి కారణమేంటీ ?

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అమలు చేసిన కొత్త రూల్స్ (FDTL) నిబంధనల ప్రకారం, పైలట్లకు వీక్లీ రెస్ట్ , నైట్ ఫ్లైయింగ్ లిమిటేషన్ (వీక్లీ 6 నుంచి 2 కి తగ్గింపు) నకు ఇండిగో ముందుగా సర్దుబాటు చేయలేదు, ఫలితంగా పైలట్ షార్టేజీ తప్పలేదు.
ఇండిగోకు DGCA షో-కాజ్ నోటీసు జారీ చేసింది. FDTL రూల్స్‌లో తాత్కాలికంగా రిలాక్సేషన్ కూడా ఇచ్చింది (నైట్ డ్యూటీలు, రెస్ట్ నిబంధనలు). కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. ఇండిగో ఎయిర్ లైన్స్‌లో డిసెంబర్ 2025 ప్రారంభంలో పురుడు పోసుకున్న ఆపరేషనల్ క్రైసిస్ ప్రధానంగా పైలట్లు క్యాబిన్ క్రూ షార్టేజ్ తో ఏర్పడింది.

ఇది దేశవ్యాప్తంగా వేలాది ఫ్లయిట్ల రద్దు , లేట్ జర్నీకి దారితీసింది. క్రొత్త ఫ్లయిట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (Flight Duty Time Limitations ) ఇండిగోకు భారీ సవాలుగా మారాయి. 2025. నవంబర్ 1 నుంచి FDTL రెండో ఫేజ్ నిబంధనల ప్రకారం, పైలట్లకు వారానికి 48 గంటల విశ్రాంతి (మునుపటి 36 గంటలకు పెరిగి), రాత్రి డ్యూటీల ప్రస్తావనను విస్తరించడం, వారానికి రెండు సార్లు రాత్రి ల్యాండింగ్ లకు కుదించింది
IndiGo Crisis : తప్పని సర్వీసుల రద్దు

డిసెంబర్ 1వ తేదీ నుండి 8 వరకు – మొత్తం 3,800 సర్వీసులను (3800 services cancelled) ఇండిగో రద్దు చేసింది. డిసెంబర్ 5 నాటికి 2,100 ఫ్లయిట్లే తిరిగాయి. – డిసెంబర్ 5 న 1,000 సర్వీసులు రద్దు, డిసెంబర్ 6 న 500 సర్వీసులు. డిసెంబర్ 7: 650 సర్వీసులను ఇండిగో రద్దు చేసింది బెంగళూరు (124 ), ముంబై (109+), ఢిల్లీ (86+), హైదరాబాద్ (66+), పూణే, లక్నో, పాట్నా విమానాశ్రయాల్లో 650 సర్వీసులు రద్దు కాగా.. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 115- ఇండిగో ఫ్లయిట్లు (54 ఆరైవల్స్, 61 డిపార్చర్స్) ఆగిపోయాయి. సోమవారం డిసెంబర్ 8న కూడా ఇక్కడ నుంచి ఇండిగో విమానాలు కదలలేదు.
IndiGo Crisis

డిసెంబర్ 7న రోజువారీ 2,300 సర్వీసుల్లో 1,650 ఇండిగో విమానాలు నడిచాయి . డిసెంబర్ 2 నుంచి మొత్తం 2,000 సర్వీసులు రద్దు కాగా.. డిసెంబర్ 5 ఒక్క రోజే 1,000 పైగా సర్వీసులను రద్దు చేయక తప్పలేదు. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తదితర మేజర్ ఎయిర్‌పోర్ట్‌లపై తీవ్ర ప్రభావం చూపింది.
అమెరికా వెళ్లేందుకు ఓ ప్రయాణికురాలు తిరుపతి నుంచి ముంబైకి ఇండిగో టిక్కెట్ బుక్ చేసుకున్న ఓ విద్యార్థిని భవిష్యత్తు దెబ్బతింది. అకస్మాత్తుగా ఇండిగో తన సర్వీసును రద్దు చేయటంతో.. ఆమె కొన్ని గంటల్లోనే ముంబైకి ఎలా చేరాలి, అమెరికా ఎలా వెళ్లాలి. అర్థం కాక కన్నీళ్లు పెట్టుకుంటే.. ఆమెకు సాయం చేసే అవకాశమే ఎవ్వరికి కుదరలేదు. ఇలాంటి ఘటనలెన్నో.. దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్నాయి.
IndiGo Crisis | తెరమీదకు రీఫండ్

టిక్కట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులను ఇక్కట్ల పాలు చేసిన ఇండిగోకు రిఫండ్ శిక్ష తప్పలేదు. డిసెంబర్ 7, 2025 రాత్రి 8 గంటల లోపు నష్టపరిహారం చెల్లించాలని డీజీసీఏ (DGCA) ఆదేశించింది. ఇప్పటికి ₹610 కోట్లు ప్రాసెస్ జరిగినట్టు సమాచారం. రీషెడ్యూలింగ్ కి ఛార్జీలు వసూలు చేయకూడదు. ఎయిర్ ఫేర్‌లపై డీజీసీఏ ఆంక్షలు విధించింది. డిసెంబర్ 5-, 15 మధ్య బుకింగ్‌లకు ఫుల్ రిఫండ్ లేదా ఫ్రీ రీషెడ్యూలింగ్ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది.
రద్దు చేసిన విమాన సర్వీసులకు 7 రోజుల్లోపు రిఫండ్ ఇవ్వాలి డిలేలకు మీల్స్ లేదా ఫుడ్ వోచర్‌లను ప్యాసింజర్లు డిమాండ్ చేయవచ్చు. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎకానమీ చార్జీలపై డీజీసీఏ క్యాప్ విధించాయి. ixigo వంటి ట్రావెల్ యాగ్రిగేటర్‌లు కన్వీనియన్స్ ఫీజులు రిఫండ్ చేస్తున్నాయి.
IndiGo Crisis | తెర మీదకు రైళ్లు

రైల్వే స్పెషల్ ట్రెయిన్లు , ఇతర ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ విమానాల్లో ప్రయాణించాలని ప్యాసెంజర్లకు ప్రభుత్వం సలహా ఇచ్చింది. డిసెంబర్ 9వ తేదీ వరకూ 89 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. 37 ప్రీమియం రైళ్లకు 116 అదనపు కోచ్‌లు జోడించింది.
IndiGo Crisis | భవిష్యత్ ఏంటీ..!?

ఇండిగో లెక్కల ప్రకారం, డిసెంబర్ 10 నుంచి -15 మధ్య 95 % నెట్‌వర్క్ రికవరీ అవుతుంది, ఫిబ్రవరి 10, 2026 నాటికి పూర్తి స్థిరత్వం కలుగుతుంది. షేర్ ప్రైస్ 6% పడింది, సోషల్ మీడియాలో (IndiGo Crisis) ప్రయాణికుల అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఇది భారత విమానయాన రంగంలో మోనోపొలీ సమస్యలను (ఇండిగో మార్కెట్ షేర్ 60% హైలైట్ చేస్తోంది.
IndiGo Crisis | నష్టాల అంచనా..

Flight Cancellations తోఅంచనా: ₹20 – 35 కోట్లు. రద్దు చేసిన ప్రతి విమాన సర్వీసులో 150 నుంచి 200 మంది ప్రయాణికులు ఇబ్బంది పడితే.. సగటున ₹10–15 లక్షల ఆదాయం ఇండిగోకు నష్టం కలిగినట్టే. డిసెంబర్ 2 నుంచి 8 వరకూ 2000 పైగా సర్వీసులు రద్దు కాగా.. ఇందులో డిసెంబర్ 5న 1000 పైగా సర్వీసులను రద్దు చేశారు. ఇలా
₹ 200– ₹ 400 కోట్లు నష్టం వాటిల్లింది. నిజానికి – ఇండిగో రోజుకు ₹6,000–6,500 కోట్ల ఆదాయం కాగ, (Q2 FY26లో ₹18,555 కోట్లు ) – కానీ 50% ఫ్లయిట్లు రద్దు కావటంతో 25 నుంచి 30% ఆదాయం పడిపోయింది.
IndiGo Crisis | ఇక పరిహారం ఎఫెక్ట్

(డిసెంబర్ 7 నాటికి ₹610 కోట్లు రిఫండ్ చేశారు. మొత్తం రిఫండ్ అంచనా ₹700–800 కోట్లు. రీషెడ్యూల్ వెయివర్, బ్యాగేజ్ రీయూనియన్ (3,000+ బ్యాగ్‌లు డెలివరీ), ప్రయాణికులకు ఫుడ్/స్టే – ₹100–200 కోట్లు అదనపు ఖర్చు తప్పలేదు.
(డిసెంబర్ 4– 5 తేదీల్లోనే ₹16,000 కోట్లు పైగా – మార్కెట్ వాల్యూ పడిపోయింది. ₹5,297 స్టాక్ ప్రైస్ (6–10% ) తగ్గింది. ఇది షేర్‌హోల్డర్లు ముఖ్యంగా ఇంటర్ గ్లోబ్ ప్రమోటర్లు ప్రత్యక్షంగా నష్టపోయారు. – Q3 FY26 (అక్టోబర్ –డిసెంబర్) ₹500–1,000 కోట్లు నష్టం అంచనా (Q2లో ఇప్పటికే ₹2,582 కోట్ల నెట్ లాస్ లో ఉంది. మొత్తం మీద డిసెంబర్ 2025 వరకూ రెవెన్యూ , రిఫండ్స్ , మార్కెట్ డ్రాప్ కలిపి ₹1,000–2,000 కోట్లు నష్టం వాటిల్లింది. ఇన్వెస్టిగేషన్, పెనాల్టీలు (₹10–50 కోట్లు సాధ్యం) ఉండవచ్చు.
click here to read తక్కువ ప్రీమియం ఆఫర్లా? తస్మాత్ జాగ్రత్త!
