Chinna Jeeyar Swami | ముచ్చింతల్ స్టాట్యూ ఆఫ్ ఈక్వలిటీలో వైభవంగా వేడుకలు..

Chinna Jeeyar Swami | ముచ్చింతల్ స్టాట్యూ ఆఫ్ ఈక్వలిటీలో వైభవంగా వేడుకలు..
తిరుమంజన సేవతో ప్రారంభమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు
త్రిదండి చిన్న జీయర్ స్వామి సందేశం – ఆత్మజ్ఞానం ప్రాముఖ్యత
సమానత్వ సందేశంతో రామానుజాచార్య ఆదర్శం
ఐదు రోజులపాటు భక్తి కార్యక్రమాలు కొనసాగింపు
Chinna Jeeyar Swami | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామ నగరంలో స్టాట్యూ అఫ్ ఈక్వలిటీ ప్రాంగణంలో శ్రీ భగవద్ రామానుజచార్య స్వామి వారి 1009వ తిరునక్షత్ర మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరునక్షత్ర మహోత్సవ వేడుకల్లో తొలి రోజు ఉదయం సువర్ణ రామానుజ మూర్తికి తిరుమంజన సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ పూజలను త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి పర్యవేక్షణలో నిర్వహించారు.
వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక అభిషేకాలు, ఆర్చనలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ ఆత్మ జ్ఞానం చాలా ముఖ్యమైనదన్నారు.శ్రీ భగవద్ రామానుజచార్య సమాజానికి అందించిన సమానత్య సందేశం అందరికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో మైహోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు దంపతులు పాల్గొన్నారు. ఐదు రోజుల పాటు కొనసాగే ఈ వేడుకల్లో వివిధ ఆధ్యాత్మిక, భక్తి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.








