Mallepalli devotees | వెంకన్న సన్నిధికి పాదయాత్ర

Mallepalli devotees | వెంకన్న సన్నిధికి పాదయాత్ర
Mallepalli devotees | ఊట్కూర్, ఆంధ్రప్రభ : రెండో తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మల్లేపల్లి భక్తులు, ఎన్నికల్లో మొక్కుకున్న మొక్కును చెల్లించేందుకు శుక్రవారం పాదయాత్రన తరలివెళ్లారు. ఊట్కూర్ మండల పరిధిలోని మల్లేపల్లి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా కతలప్ప మూడో విడత ఎన్నికల్లో గెలుపొందుతే మన్నెంకొండ వెంకటేశ్వర స్వామికి పాదయాత్రన వెళ్లి మొక్కులు తీర్చుకుంటామని అభిమానులు మొక్కుకున్నారు.
ఈనేపథ్యంలో ఈనెల 17న జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ కతలప్ప గెలుపొందారు. దీంతో వీరాభిమానులు గ్రామంలోని వివిధ దేవాలయాల్లో పూజలు చేసి జి.వెంకటేష్, రాజు, సందాపురం అంజి, లోకపల్లి అంజి పాదయాత్రన వెళ్లడంతో సర్పంచ్ కతలప్పతో పాటు పలువురు నాయకులు ఘనంగా వీడ్కోలు పలికి వెంకన్న దివ్యదర్శనం సవ్యంగా జరగాలని ఆకాంక్షించారు.
