Mohanlal | వృష‌భ‌ వచ్చేది ఎప్పుడు..?

Mohanlal | వృష‌భ‌ వచ్చేది ఎప్పుడు..?

Mohanlal, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న ప్రెస్జీజియస్ మూవీ వృష‌భ‌. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తోంది. ఈ నెల 25న వృష‌భ‌ సినిమా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ భారీ చిత్రాన్ని కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్ల పై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు.

విమ‌ల్ ల‌హోటి స‌హ నిర్మాత‌గా వ్యవహరిస్తున్న వృష‌భ‌ సినిమాను దర్శకుడు నందకిషోర్ మ‌ల‌యాళం, తెలుగులో రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన వృష‌భ‌ టీజర్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. మోహన్ లాల్, స‌మ‌ర్జీత్ లంకేష్‌, రాగిణి ద్వివేది, న‌య‌న్ సారిక‌, అజ‌య్‌, నేహా స‌క్సేనా, గ‌రుడ రామ్‌, విన‌య్ వ‌ర్మ‌, అలీ, అయ‌ప్ప పి.శ‌ర్మ‌, కిషోర్, తదితరులు నటించారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా పై ముందు నుంచి పాజిటివ్ టాక్ ఉంది. మరి.. వృషభ.. తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Leave a Reply