Corporation Chairman | యువతకు అభినందనలు..
Corporation Chairman | యువతకు అభినందనలు..
Corporation Chairman | ఉయ్యురు, ఆంధ్రప్రభ : నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేందుకు గౌడ యువత ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి (gurumurthi) అన్నారు. ఉయ్యూరులో గౌడ సంఘానికి చెందిన 40 సెంట్లు భూమి గత 50 సంవత్సరాలుగా నిరుపయోగంగా పడి ఉంది. దానిని ఉపయోగకరంగా మార్చి సంఘంలో వారికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేందుకు గౌడ యూత్ ఆధ్వర్యంలో కళ్యాణమండపం నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రహరీ గోడను నిర్మించేందుకు భూమి పూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ (chairmen) వీరంకి వెంకట గురుమూర్తి, గౌడ సంఘ నాయకులు రాజులపాటి రామచంద్రరావు, రాజులపాటి ఫణి, మొరాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 50 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న భూమిలో కళ్యాణ మండపం నిర్మించి పేద గౌడ కులస్తులతో పాటు అందరికీ ఉపయోగపడాలని గౌడ యువత చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
