అనుభవం ఉన్నవారికి అవకాశం కల్పించండి

ధర్మపురి, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధి కోసం అనుభవం ఉన్న తనకు మరోసారి సర్పంచ్‌గా అవకాశం కల్పించాలని తీగల ధర్మారం సర్పంచ్ అభ్యర్థి పందిరి అశోక్ ప్రజలను అభ్యర్థించారు. గతంలో మండలంలో పలు పదవులు చేపట్టి సేవలందించిన అనుభవంతో, ఈసారి కూడా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారంతో గ్రామానికి అత్యధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్తానని అశోక్ హామీ ఇచ్చారు. తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ తనకు ఆశీర్వాదం అందిస్తున్నారని అశోక్ పేర్కొన్నారు.
