School | ఆదరించండి…. అభివృద్ధి చేస్తా

School | ఆదరించండి…. అభివృద్ధి చేస్తా
School | లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : సర్పంచ్ గా ఆదరించండి మరింతగా కొత్త కొమ్ముగూడెం గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కత్తెర గుర్తు సర్పంచ్ అభ్యర్థి సందెల సుజాత-సురేష్ అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao) అండదండలతో ఇప్పటికే గ్రామానికి పలు రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు వచ్చేలా కృషి చేసినట్లు పేర్కొన్నారు.
గ్రామంలోని పాఠశాల(School) మూతపడటంతో పూర్వ విద్యార్థుల సహకారంతో పాటు ఎమ్మెల్యే ఆశీస్సులతో తిరిగి బడిని తెరిపించినట్లు వివరించారు. పూర్వ విద్యార్థులు రూ. లక్ష యాభై వేలు అందించి పాఠశాలను తెరిపించడంలో ముఖ్య పాత్ర వహించారన్నారు. నేడు విద్యార్థుల రవాణాకు తన స్వంత ఖర్చులుగా నెలకు రూ 5 వేలు భరిస్తున్నట్లు తెలిపారు.
పాఠశాల కాంపౌండ్ వాల్(Compound Wall), దౌడేపల్లి మెయిన్ కెనాల్ 4 కిలోమీటర్ల నిర్మాణం కోసం సుమారు రూ. 2.80 కోట్లు ఎమ్మెల్యే కేటాయించినట్లు వివరించారు.చెరువు సుందరీకరణ, బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్టు తెలిపారు. 27 ఇందిరమ్మ ఇండ్లు, వైకుంఠ ధామం సీసీ రోడ్, కరెంటు సౌకర్యం, మినీ ట్యాంక్ బ్యాండ్(mini tank band), వడ్ల వాళ్ల ఇంటి దగ్గర నుంచి కెనాల్ బ్రిడ్జి లకు నిధులు ఎమ్మెల్యే కేటాయించినట్లు పేర్కొన్నారు.
తాను సర్పంచ్ గా గెలిచినా వెంటనే ఐకేపీ సెంటర్, గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడీ భవన్, ప్రతి వార్డ్ లో డ్రైనేజీ సౌకర్యం, రెండవ విడతలో 40 ఇందిరమ్మ ఇండ్లు, అర్హులైన వారికి పెన్షన్స్, ప్రతి వార్డ్ లో నీటి సౌకర్యం, విద్యుత్, డ్రైనేజీ నిర్వహణ తన ప్రధాన హామీలని వివరించారు.
తాను, తన భర్త నిత్యం ప్రజల్లో ఉంటూ గతంలో కూడా అనేక రకాల సేవ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. కొత్త కొమ్ముగూడెం ప్రజలు కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని, అభివృద్ధి సందడిని సందేలా సుజాత-సురేష్ లతో గ్రామంలో చూడాలని ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
