IPL | ఐపీఎల్‌ వేలం.. 1,005 పేర్లు తొలగింపు!

IPL | ఐపీఎల్‌ వేలం.. 1,005 పేర్లు తొలగింపు!

IPL | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : 2026 ఐపీఎల్ (IPL) సీజన్‌ కోసం జరిగే లీగ్‌ ఆక్షన్‌కు ముందే బీసీసీఐ కీలక మార్పులు చేసింది. వేలంపాట జాబితాలో భారీ ఎత్తున పేర్లు తొలగించి, కొత్త ఆటగాళ్లను చేర్చుతూ లిస్టును సవరించింది. ఐపీఎల్‌ 2026 లీగ్‌ ఆక్షన్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 350 మంది ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు. నమోదు చేసుకున్న ప్లేయర్ల జాబితా నుంచి బీసీసీఐ (BCCI) అనూహ్యంగా 1,005 మంది పేర్లను తొలగించింది.

అలాగే 35 మంది కొత్త ఆటగాళ్ల పేర్లను చేర్చింది. ‘350 మంది ఆటగాళ్లకు సంబంధించిన ఆక్షన్‌ డిసెంబర్‌ 16 మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో అబుదాబీలో జరగనుంది’ అని బీసీసీఐ.. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల (IPL franchises) కు పంపిన మెయిళ్లలో పేర్కొంది. మొదట బిడ్డింగ్ ప్రక్రియ.. బ్యాటర్లు, ఆల్ రౌండర్లు, వికెట్-కీపర్/బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్ బౌలర్లు అనే విభాగాల వారీగా క్యాప్డ్ ఆటగాళ్లతో ప్రారంభమవుతుంది. తరువాత, అన్‌క్యాప్డ్ ఆటగాళ్లకు కూడా ఇదే వరుసక్రమంలో జరిగే అవకాశముంది.

‘క్రిక్‌బజ్’ నివేదిక ప్రకారం.. ఓ ఫ్రాంఛైజీ క్వింటన్‌ డికాక్ (Quinton de Kock) పేరును జాబితాలో చేర్చమని కోరడంతో అతడికి జాబితాలో స్థానం దక్కినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాకు చెందిన వికెట్‌ కీపర్‌/బ్యాటర్‌ డికాక్‌ గతంలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కానీ మళ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇటీవల విశాఖపట్నం వేదికగా భారత్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో అతడు సెంచరీ చేసిన విషయం తెలిసిందే. రానున్న ఆక్షన్‌లో క్వింటన్‌ డికాక్‌ కనీస ధర రూ.కోటి ఉండనున్నట్లు సమాచారం. గత వేలంతో పోల్చుకుంటే అతడి ధర 50 శాతం తగ్గింది. అప్పుడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అతన్ని రూ.2 కోట్లకు తీసుకుంది.

Leave a Reply