AP : మాధ‌వీల‌త‌పై నోరుజారిన‌ జేసీ ప్రభాకర్ రెడ్డి.. కేసు నమోదు

టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదయింది. సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే, న్యూ ఇయర్ సందర్భంగా మహిళల కోసం తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చారు. అదే సమయంలో ఈవెంట్ గురించి మాధవీలత ఓ వీడియో రిలీజ్ చేశారు.

ఈవెంట్ కు మహిళలు ఎవరూ వెళ్లవద్దని… ఈవెంట్ నిర్వహిస్తున్న స్థలం సురక్షితం కాదని ఆమె సూచించారు. ఆమె వ్యాఖ్యలపై జేసీ మండిపడ్డారు. ఆమె ఒక వ్యభిచారి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మాధవీలతకు క్షమాపణలు చెబుతూ.. ఆవేశంలో అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. అయితే, జేసీ వ్యాఖ్యలపై కొన్ని రోజుల క్రితం మాధవీలత సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జేపీ వ్యాఖ్యలు తనను మానసిక వేదనకు గురి చేస్తున్నాయని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు జేసీపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ క్షమాపణ చెప్పిన తర్వాత అంతా సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో, తాజాగా ఆయనపై కేసు నమోదు కావడం చర్ఛనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *