Team india | సింహాద్రి అప్ప‌న్నా.. గెలిపించ‌య్యా!

  • సింహాచలం పుణ్యక్షేత్రంలో టీమిండియా క్రికెట‌ర్లు
  • ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు
  • వారికి స్వాగ‌తం ప‌లికిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

Team india | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్ కోసం టీమిండియా క్రికెటర్లు విశాఖపట్నం విచ్చేసిన విష‌యం తెలిసిందే. విశాఖలో నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య నాలుగో టీ20 జరగనుంది. అయితే ఇవాళ ఉద‌యం విశాఖపట్నంలోని సింహాచలం పుణ్యక్షేత్రాన్ని భార‌త ఆట‌గాళ్లు సందర్శించారు. టీమ్ండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వాగతం పలికారు. దర్శన అనంతరం క్రికెటర్లకు అర్చకులు ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.