Gold Eyes | బంగారు కన్నులు సమర్పణ..

Gold Eyes | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ శ్రీ అంబాత్రాయ క్షేత్రంలో వెలసిన శ్రీ భవాని మాత రుద్రశూలానికి బంగారు కన్నులు భక్తులు కృష్ణ చైతన్య చారి, సంతోష్ చైతన్య చారి సోమవారం అంబాత్రేయ శక్తి పీఠం(Ambatreya Shakti Peetham) వ్యవస్థాపకులు శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీకి అందజేశారు. కొలిచిన వారికి కొంగుబంగారంగా బాసిల్లుతున్న బిజ్వార్ అంబాత్త్రయ శక్తి పీఠం శ్రీ భవానిమాత కోరిన వారి కోరికలు తీర్చే కల్పతరువు(Kalpataru)గా విరజిల్లుతుంది.
దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తమ కోరికలు నెరవేరడంతో తమ శక్తి కొలది కానుకలు(Gifts according to power) సమర్పిస్తున్నారు. అమ్మవారి రుద్రశులానికి బంగారు కన్నులు సమర్పించిన భక్తులు శక్తి పీఠం డాక్టర్ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత అలవార్చుకోవాలని అమ్మవారి ఆశీస్సులు పొందుతే సకల శుభాలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శక్తి పీఠం సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
