State | గ్రామాన్ని అభివృద్ధి చేస్తా

State | గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
State | నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని నల్లగొండ మండలం దండపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి మల్లెబోయిన ఆంజనేయులు అన్నారు.
ఈ రోజు గ్రామంలో గడప గడపకు ప్రచారం చేపట్టిన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం(State)లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుందని, మంత్రి సహకారంతో మరింత అభివృద్ధి(development) చేస్తానన్నారు. గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
