RAVI | సమస్యలు పరిష్కరిస్తా..

RAVI | సమస్యలు పరిష్కరిస్తా..
RAVI | ధర్మపురి, ఆంధ్రప్రభ : తనకు ఒకసారి గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇస్తే.. కమలాపూర్ గ్రామంలోని ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కమలాపూర్ సర్పంచ్ అభ్యర్థి కుమ్మరి రవి తెలిపారు. సోమవారం గ్రామంలోని పలు వార్డులలో ఇంటింటా ప్రచారం చేశారు. పలువురు వార్డుల సమస్యలను తెలుపగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 2వ వార్డులో అప్పల గంగన్న తనకు పెన్షన్ లేదని ఇప్పించాలని కోరగా ఎన్నికల్లో గెలుపొందిన వెంటనే మంత్రి సహకారంతో పెన్షన్ వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. తనకు భారీ మెజార్టీతో విజయం కల్పించాలని ఆయన ఓటర్లను కోరారు.
