elections | ఆదర్శ గ్రామంగా మారుస్తా..

elections | ఆదర్శ గ్రామంగా మారుస్తా..

  • ఓటు వేసి గెలిపించింది…

elections | పెద్దవంగర, ఆంధ్రప్రభ : సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఇవాళ‌ అవుతాపురం గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తోటకూరి శ్రీనివాస్ తరుపున టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి(Hanumandla Jhansi Rajender Reddy) ప్రచారం చేశారు.

సర్పంచ్ అభ్యర్థి తోటకూరి శ్రీనివాస్ మాట్లడుతూ.. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఇంటింటి ప్రచారం చేసి కత్తెర గుర్తుకు తనకు ఓటు వేసి గెలిపించాలని .. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈనెల 14వ‌ తేదీన జరిగే సర్పంచ్ ఎన్నికల్లో(elections) ఓటు వేసి ఆశీర్వదించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply