Psychiatrist | విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు..

Psychiatrist | కమలాపూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులు పరీక్షా సమయంలో మానసిక ఒత్తిడికి గురికాకూడదని సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రహసిత్ తెలిపారు. ఈ రోజు కమలాపూర్ కేజీబీవీ (KGBV) స్కూల్ లో మానసిక ఆరోగ్యంపై నిర్వహించిన అవగాహన(Awareness) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైకియాట్రిస్ట్ ప్రహసిత్ మాట్లాడుతూ… విద్యార్థులు పరీక్షల సమయంలో ఒక ప్రణాళికాబద్దంగా, సబ్జెక్టుల వారిగా పరీక్షలకు ప్రిపేర్ (Prepare for exams) కావాలన్నారు.
విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధన దిశగా కృషి చేయాలన్నారు. మానసిక ఆరోగ్య(mental health) సమస్య చెప్పుకోవడానికి వెనుకాడకూడదని సూచించారు. అలాగే నిద్రలేమి, చదువు పట్ల టెన్షన్, ఆహారపు విధానాల్లో మార్పులు, నిరంతరం విచారం(Constant sadness) వంటి వాటివల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు. అలాగే పరీక్షల్లో పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా అని భయపడకుండా పట్టుదలతో చదవాలని సూచించారు.
