Rahul Gandhi Birthday | శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

Rahul Gandhi Birthday | శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

Rahul Gandhi Birthday | హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమ వేదికగా స్పందించిన సీఎం, రాహుల్ గాంధీ దేశ రాజకీయాల్లో ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు.

స్ఫూర్తినిచ్చే నాయకుడు : రేవంత్
రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రత్యేక సందేశాన్ని పోస్టు చేశారు. “మనందరికీ స్ఫూర్తినిచ్చే నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమంపై ఆయనకున్న అచంచలమైన నిబద్ధత ఎందరికో స్ఫూర్తినిస్తూనే ఉంది” అని పేర్కొన్నారు.

శుభాకాంక్షల వెల్లువ
రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర
ప్రస్తుతం లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాహుల్ గాంధీ, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం తన స్వరం వినిపిస్తూ, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.