MEDICINE| మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓసీ అందజేత..

MEDICINE| భవానిపురం, ఆంధ్రప్రభ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో మంజూరైన (లెటర్ ఆఫ్ క్రెడిట్ ) ఎల్ ఓసీను మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో అందజేశారు. 41 వ డివిజన్, ప్రెసిడెంట్ వీధికి చెందిన సయ్యద్ ఖాజా భాష ( 50) క్యాన్సర్ తో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనకి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్ ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కొరకు దరఖాస్తు చేశారు. మంజూరైన రూ. 5 లక్షల 25 వేల ఎ.ల్. ఓ.సీను బాధితుడి సోదరుడికి అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓసీను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతలు వేంపలి గౌరీ శంకర్ , సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
