Mopidevi temple | మంత్రి కొల్లు రవీంద్ర..

Mopidevi temple | మంత్రి కొల్లు రవీంద్ర..
Mopidevi temple, కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లాలోని మోపిదేవిలోని శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వర ప్రసాదరావు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత నాగ పుట్ట వద్ద పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారి పేరిట విశేష పూజలు చేయించారు. అనంతరం ఆలయ ఈవో స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
