Rains update | నెల్లూరు జిల్లాకు వర్ష సూచన..

Rains update | నెల్లూరు జిల్లాకు వర్ష సూచన
Rains update, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఓ వైపు చలి వణికిస్తుంటే.. మళ్లీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం.. నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియచేసింది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు (Chittoor) జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని సమాచారం. అంతే కాకుండా, ఈనెల 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వెల్లడించింది.
