BC reservation | బీసీలకు అండగా ప్రభుత్వం..

BC reservation | బీసీలకు అండగా ప్రభుత్వం..

BC reservation, బిక్కనూర్, ఆంధ్రప్రభ : బీసీ కులస్తులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇటిక్యాల సురేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కులస్తులకు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు చేస్తుందని గుర్తు చేశారు. శాసనసభలో బీసీ రిజర్వేషన్ల కోసం ఆమోదం తెలిపి గవర్నర్ కు పంపగా అక్కడ ఫైల్ పెండింగ్ లో పెట్టారని గుర్తు చేశారు. అయినప్పటికీ.. బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయడం జరుగుతుందన్నారు.

గత ప్రభుత్వం బీసీ (BC) కులస్తులను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. అట్టి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు.

Leave a Reply