THIEF | పట్టించిన సాంకేతిక పరిజ్ఞానం

  • రైళ్లలో దొంగతనం చేసిన వ్యక్తి…
  • రూ 87 లక్షలు ఉన్న బ్యాగ్ తస్కరణ
  • అనుమానీతుడి కదలికలపై నిఘా
  • సీసీ కెమెరాలు, సెల్ టవర్ల ద్వారా నిందితుల గుర్తింపు
  • 15 రోజుల్లో నే శ్రమించి పట్టుకున్న రైల్వే పోలీసులు
  • నిందితుల వద్ద నగదు స్వాధీనం
  • రైల్వే పోలీసుల పనితీరుకు ప్రశంసలు

THIEF | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : రైళ్లలో నిద్రిస్తున్న సమయంలో విలువైన బ్యాగ్ ను దొంగిలించి రైల్వే పోలీసులకు (Rly Police) సవాల్ విసిరిన దొంగలను చాకచక్యంగా పూర్తి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విజయవాడ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే వెంకటరమ పౌల్ట్రీ ఫారం లో బెజవాడ నాగరాజు మేనేజర్ గా పని చేస్తూ తన కంపెనీ పనిమీద విజయనగరం నుండి రూ 87 లక్షల రూపాయలు నగదు తీసుకుని రాయగడ ఎక్స్ప్రెస్ లో గుంటూరు కు బయలుదేరిన సమయంలో అర్ధరాత్రి మెలకువ వచ్చి బ్యాగ్ ఎవరో దొంగిలించినట్లు, గుర్తు గుర్తు తెలియని దొంగలు దొంగిలించుకుని పారిపోయారని విజయవాడ జిఆర్పిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసును ఛాలెంజేంగా తీసుకున్న విజయవాడ రైల్వే డిఐజి సత్య యేసు బాబు ఆధ్వర్యంలో విజయవాడ(Vijayawada) రైల్వే డివిజన్ ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్, షణ్ముఖ వడివేలు సారథ్యంలో డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ రైల్వేస్ జి రత్నరాజు, పొన్నూరు స్వామి నేతృత్వంలో గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జేవి రమణ ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ అలీ బేగ్, సిఐబి ఇన్స్పెక్టర్ మధుసూదన్ పలు బృందాలుగా విడిపోయి ఆర్పిఎఫ్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ కెమెరాలతో పాటు, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ముందుగా దొంగిలించిన వ్యక్తి ఆనవాళ్లను గుర్తించారు. స్టేషన్ నుండి బయటకు వచ్చినపుడు అతని కదిలికలు ట్రాక్ (Track) చేసి విజయవాడ వారిది జంక్షన్ పొన్నూరు చీరాల తో పాటు పలు ప్రాంతాల గుండా పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఆటోలు ప్రైవేటు వాహనాలు ఆర్టీవో ఆర్టీసీ బస్సుల ద్వారా వివిధ రవాణా మార్గాలను ఉపయోగించి రైల్వే పోలీసుల కన్నుకప్పి తిరుగుతూ ఉన్నాడు.

అయితే బృందాలు సిసి కెమెరాలు డ్రైవర్లు కండక్టర్ తో విచారణ చేసి అతనిని వ్యూహాత్మకంగా ట్రేస్(Trace) చేయగలిగారు. విశాఖపట్నం తో పాటు పలు ప్రాంతాలలోకి వెళ్లిన రైల్వే పోలీస్ బృందాలు అక్కడ సీసీ కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి అనుమానితుడి ఫోటోకు దగ్గరగా ఉన్న ఫోటోలతో బోధాల అశోక్ కుమార్ అనే వ్యక్తిని గుర్తించారు. పూర్తి సాంకేతిక మార్గాల ద్వారా బోదాల అశోక్ కుమార్ బోధన లలిత్ బాబులు ప్రమేయాన్ని ఈ కేసులో నిర్ధారించిన పోలీసులు ఆదివారం సాయంత్రం చెన్నై వెళ్లేందుకు సిద్ధమవుతున్న వీరిని రైల్వే స్టేషన్ కు వస్తుండగా పార్సిల్ ఆఫీసు వద్ద వలపర్ని పట్టుకున్నారు. వీరు నుండి రూ 84,50,000/- నగదును కూడా రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ తో పాటు సహాయక సిబ్బంది ఈ కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేయడంతో ఉన్నతాధికారులు వీరిని అభినందించారు.

Leave a Reply