ఆ జ్యోతి జీవితంలో.. కొత్త వెలుగు

ఆ జ్యోతి జీవితంలో.. కొత్త వెలుగు

మంత్రి లోకేష్ తక్షణ స్పందన
బిక్షాటన బదులు.. ఉద్యోగం

గుంటూరు, ఆంధ్రప్రభ : ఉన్న ఒక్కగానొక్క కొడుకును పోషించేందుకు బిక్షాటన చేస్తున్న ఓ అంధురాలి జీవితాన్ని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) మార్చారు. పాత గుంటూరు (Guntur)కు చెందిన జ్యోతి చిన్న వయసులో కంటి చూపు కోల్పోయింది. వివాహిత అయిన ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. భర్త, తల్లిదండ్రులు చనిపోవడంతో ఆ ఒక్క కుమారుడిని చదివించుకునేందుకు బిక్షాటనకు దిగింది.

బిక్షాటన సమయంలో ఆమె పట్ల కొందరు అనుచితంగా ప్రవర్తించడాన్ని సోషల్ మీడియా వెలుగులోకి తీసుకువచ్చింది. దీనిపై స్పందించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (Government Public Hospital)లో పారిశుధ్య విభాగంలో ఔట్ సోర్సింగ్ (Outsourcing) విధానంలో ఉద్యోగ కల్పన చేశారు. కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా (Collector A Tamim Ansaria) శనివారం తన కార్యాలయంలో నియామక పత్రాన్ని అందించారు. కొద్దిరోజుల కిందట కొడుకు నిమోనియా (neumonia) వ్యాధికి గురి అయినప్పుడు కూడా కలెక్టర్ అన్సారియా తక్షణం స్పందించి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందేటట్లు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వి.రమణ కూడా పాల్గొన్నారు.

Leave a Reply