Commissioner | ఆకస్మిక తనీఖీలు..

Commissioner | ఆకస్మిక తనీఖీలు..

కరీమాబాద్, ఆంధ్రప్రభ – వరంగల్ (Warangal) నగరపాలక సంస్థ కమీషనర్ చాహిత్ వాజ్పాయ్ గురువారం ఉదయం ఆకస్మికంగా 34వ డివిజన్, 35వ డివిజన్ ల్లో పర్యటించారు. 34 డివిజన్లో కొన్ని వీధుల్లో భగీరథ త్రాగునీరు గత నాలుగు సంవత్సరాల నుండి రావడం లేదు అనే సమస్య డివిజన్ వాసులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో రోడ్ల పై నీరు ప్రవహించడం పై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు గురించి కమీషనర్ పర్యటించి డ్రైనేజీలను సైడ్ కాలువలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమీషనర్ (Commissioner) మాట్లాడుతూ… శివనగర్ లోని అండర్ డ్రైనేజీ డక్ట్ పనులు పూర్తి కావస్తున్నాయని.. పనులు పూర్తి అయిన తర్వాత శివనగర్ రోడ్ల పై వర్షపు నీరు ప్రవహించడం నిలిచిపోతుందని ఆమె అన్నారు. స్థానికులు కొందరు కోతులు, కుక్కల సమస్యను కమీషనర్ దృష్టికి తీసుకుని రాగా చర్యలు తీసుకుని కోతులను కుక్కలను బంధించి వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించడం జరుగుతుందని తెలిపారు. రోడ్ల పై కుక్కలు తిరగకుండా పరిశీలించాలని ఆమె ఏసీపి కమాలుద్దీన్ కు సూచించారు. ఉదయం 8:30 నుండి 10 గంటల వరకు శివనగర్లో పర్యటించి అన్ని సమస్యలను సావధానంగా ఆలకించి సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.

చికెన్ సెంటర్ తనిఖీ చేసి వాటి పరిశుభ్రతను, వాడుతున్న క్యారీ బ్యాగులను పరిశీలించారు. పారిశుద్ధ కార్మికుల అటెండెన్స్ పరిశీలించారు. స్వచ్ఛ సర్వేక్షన్ ఆటో ఎంత మేరకు చెత్త సేకరిస్తున్నారు.. డ్రైవర్ ను జవాన్లను అడిగి తెలుసుకుని స్వయంగా స్వచ్ఛ సర్వేక్షన్ ఆటోను పరిశీలించారు. ఆమె వెంట ఏసీపీ (ACP) కమాలుద్దీన్, ఎంహెచ్ఓ రాకేష్, ఏఈ హబీబ్, సానిటరీ ఇన్స్పెక్టర్ రాజు, డివిజన్ జవాన్లు, కార్పొరేటర్ అంజయ్య పాల్గొన్నారు.