సొమ్ము కేంద్రానిది… సోకు రాష్ట్రానిదా!!
సొమ్ము కేంద్రానిది… సోకు రాష్ట్రానిదా!!
ఊట్కూర్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు అధికంగా నిధులు ఇస్తోందని, కాంగ్రెస్ నాయకులు తామే బియ్యం పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం హాస్యస్పదంగా ఉందని నారాయణపేట బీజీపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.భాస్కర్(M. Bhaskar) విమర్శించారు.
ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కష్ట కాలం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా బియ్యాన్ని పంపిణీ(free distribution of rice) చేస్తున్నారని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేస్తుండగా కాంగ్రెస్ నాయకులు రేషన్ దుకాణాలు, రోడ్లపై బియ్యం పంపిణీ ఫోటోలు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని మండి పడ్డారు. ప్రతి రేషన్ డీలర్ షాపు దగ్గర ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. బియ్యం పంపిణీకి కేంద్ర ప్రభుత్వం(Central Govt) అధిక నిధులు ఖర్చు చేస్తుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి కొండన్ గోపాల్, సీనియర్ నాయకులు లక్ష్మణ్, ఆశప్ప తదితరులు పాల్గొన్నారు.
