డిగ్రీ కళాశాలలో జిమ్ ప్రారంభం

డిగ్రీ కళాశాలలో జిమ్ ప్రారంభం
పూర్వ విద్యార్థుల సహకారంతో…
పాల్వంచ, ఆంధ్రప్రభ : పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థులు లక్ష రూపాయలతో ఏర్పాటు చేసిన జిమ్ ను రిటైర్డ్ ప్రిన్సిపాల్ నర్సింహ కుమార్ (Narasimha Kumar) సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాల్వంచ డిగ్రీ కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థి సంఘం కీలకంగా పనిచేస్తోందన్నారు. చదువుకున్న కళాశాల రుణం తీర్చుకొనేందుకు చేస్తున్న కృషిని ప్రశ్నించారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పద్మ మాట్లాడుతూ… పాల్వంచ డిగ్రీ కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ రావడానికి పూర్వ విద్యార్థుల కృషి మరువలేమన్నారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలాలకు ధీటుగా అత్యధిక అడ్మిషన్లు చేసి ఆదర్శంగా నిలిపామని పద్మ తెలిపారు. కళాశాలలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి పూర్వ విద్యార్థులు అండగా నిలవాలని కోరారు.

విద్యార్థులకు వ్యాయామం అవసరం: రమేష్
పాల్వంచ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పసునూరి రమేష్ (Pasunuri Ramesh) మాట్లాడుతూ… విద్యార్థులకు చదువుతో పాటు వ్యాయామం అవసరమన్నారు. ప్రభుత్వ కళాశాలలో ఎక్కువ మంది నిరుపేద విద్యార్థులు ఉన్నారని, వారు బయటకు వెళ్లి జిమ్ లో చేరాలంటే ఇబ్బంది పడుతున్నారు. అందుకే పూర్వ విద్యార్థులు లక్ష రూపాయల విరాళాలు సేకరించి విద్యార్థులకు కళాశాలలోనే జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
చదుకున్న కళాశాల అభివృద్ధికి తమవంతు సహాయం చేస్తున్నామన్నారు. గతంలో రూ.2.50 లక్షలతో స్కూటర్ స్టాండ్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అలాగే కళాశాలకు రూ.1.80 లక్షలతో కుర్చీలు అందజేయడం జరిగిందన్నారు. అడగ్గానే సహాయ సహకారాన్ని అందించిన పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా కళాశాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు ఎర్రపాటి కృష్ణ, వెంకట్, నాగేశ్వరరావు, కుర్మా విజయ రావు, కోటగిరి రాంబాబు, కృష్ణా, నర్సింహా రావు, మాధవి, పావని, రాధిక, తదితరులు పాల్గొన్నారు.

