Rave Party | అసత్య ప్రచారం ఆపాలి..
Rave Party | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై నటి హేమ తీవ్రంగా స్పందించారు. కర్ణాటక హైకోర్టు తనపై నమోదైన కేసును కొట్టివేసిందని, డ్రగ్స్ పరీక్షల్లోనూ నెగటివ్ వచ్చినప్పటికీ కొందరు ఇప్పటికీ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వ్యాఖ్యలు, తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న వారిపై పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫేక్ అకౌంట్ల వెనుక దాక్కుని దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నిజాలు బయటకు వచ్చిన తర్వాత కూడా తనపై ట్రోలింగ్ కొనసాగించడం బాధాకరమని పేర్కొన్న హేమ, సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
