ముచ్చట కోసం వచ్చి…

భవనం బాల్కానీ కూలి మహిళ మృతి..
పెద్దపల్లి జిల్లా ఓదెల, ఆంధ్రప్రభ : ముచ్చట పెట్టేందుకు వచ్చి.. ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్న వృద్ధురాలి ఉదంతమిది. పొరుగింటికి సరదాగా మాట్లాడుకుందామని వచ్చిన ఓ మహిళపై ప్రమాదవశాత్తు(By accidentBy accident) భవనం బాల్కనీ పరదా కూలడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఓదెల మండలం కొలనూర్ గ్రామం(Kolanur village)లో ఈ రోజు చోటు చేసుకుంది.
మండలంలోని కొలనూరు గ్రామానికి చెందిన అంతగిరి రాజేశ్వరి(Antagiri Rajeshwari) (70) అనే మహిళ ఈ రోజు గ్రామానికి చెందిన గడవేన ఐలమ్మ ఇంటికి ముచ్చట కోసం వచ్చింది. ఐలమ్మతో మాట్లాడుతున్న సమయంలోనే భవనానికి ఉన్న బాల్కనీ పరదాతోపాటు దానికి ఆనుకొని ఉన్న రేకులు ఒక్కసారిగా కూలడంతో రాజేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది.
ముచ్చట కోసం పక్కింటికి వెళ్లి ప్రమాదవశాత్తు రాజేశ్వరి మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సంఘటన స్థలానికి పొత్కపల్లి ఎస్ ఐ దీకొండ రమేష్(SI Dikonda Ramesh) చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు సాగిస్తున్నారు. ప్రమాదవశాత్తు మహిళ మృతిచెందిన ఘటన గ్రామంలో విషాద ఛాయలు నింపింది.

