సమస్యలపై పోరాటం చేసేదే ప్రజానాట్యమండలి
చిట్యాల, ఆంధ్రప్రభ : కళ కాసుల కోసం కాదు, ప్రజలందరి కోసం అని నినదించి, పీడిత ప్రజలను చైతన్య వంతం చేసేది ప్రజా నాట్య మండలి(Public Dance Council) అని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్ అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో ఈ రోజు జరిగిన ప్రజా నాట్య మండలి మండల మహాసభకు ఆయన విచ్చేసి మాట్లాడారు.
కార్మక, కర్షక, విద్యార్థి, యువజన, మహిళా ఉద్యమాలకు వెన్నంటి, పాలక వర్గ విధానాలను ప్రజలకు వివరించే కళా సంపద ప్రజా నాట్య మండలి అని చెప్పారు. మహాసభల ప్రారంభ సూచకంగా ఏర్పాటు చేసిన జెండాను శంకర్(Shankar) ఆవిష్కరించారు. అనంతరం ప్రజా నాట్య మండలి చిట్యాల మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు తెలిపారు.

