APBJPPresident | స్వదేశీ ఉత్పత్తులతోనే రూపాయి బలోపేతం

APBJPPresident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: భారతదేశం తన విదేశీ మారక నిల్వలలో సింహభాగాన్ని బంగారం, క్రూడ్ ఆయిల్ దిగుమతులకే ఖర్చు చేస్తోందని, దీనివల్ల రూపాయి విలువపై ప్రభావం పడుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ పేర్కొన్నారు.

‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాలకు అనుగుణంగా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారానే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆయన అన్నారు. దేశీయ ఉత్పత్తి, తయారీ రంగాల అభివృద్ధితో రూపాయి స్థిరత్వాన్ని సాధించవచ్చని అభిప్రాయపడ్డారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘వికసిత్ భారత్’ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కూడా ‘2047 విజన్’ను రూపొందించారని తెలిపారు. దేశ అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని మాధవ్ పేర్కొన్నారు.