లక్ అంటే ఇలా ఉండాలి..

లక్ అంటే ఇలా ఉండాలి..
లక్.. ఉంటే జీవితం ఇట్టే మారిపోతుంది. ఆ లక్ అనేది లాటరీ రూపంలో తగిలితే.. అప్పటి వరకు పడిన కష్టాలు అన్నీ క్షణాల్లో మాయమైపోతాయి. పేదోడు కూడా కోటీశ్వరుడు అయిపోతాడు. ఇలాంటిది ఖమ్మం జిల్లా వాసికి జరిగింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరానికి చెందిన యువకుడిని అదృష్టం వరించింది. తన తల్లి పుట్టినరోజు తేదీ సంఖ్యతో తీసుకున్న లాటరీ టిక్కెట్ కు ఏకంగా రూ 240 కోట్లు తగిలింది. భోళ్ల మాధవరావు, భూలక్ష్మి కుమారుడు అనిల్ కుమార్. ఇటీవల యూఏఈలో తీసిన లాటరీలో ఆయనకు 240 కోట్లు వరించాయి.
సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన బోళ్ల అనిల్ కుమార్ ప్రాధమిక విద్య అనంతరం హైదరాబాద్ లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం యూఏఈలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే.. గత కొంతకాలంగా లాటరీ టిక్కెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇటీవల తన తల్లి పుట్టినరోజుతో కూడిన నెంబర్ వచ్చేలా లాటరీ టిక్కెట్ కొన్నాడు. ఈ టిక్కెట్ కు జాక్ పాట్ తగిలింది. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయ్యింది. పేదరికంలో ఉన్న ఈ కుటుంబం ఈ లాటరీతో ఒక్కసారిగా ధనికులను చేసింది.
