Suryavanshi4 runs | జెమీస‌న్‌కు బీసీసీఐ వార్నింగ్

Suryavanshi4 runs | జెమీస‌న్‌కు బీసీసీఐ వార్నింగ్

Suryavanshi4 runs | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : ఐపీఎల్‌లో 2026లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ వివాదాస్ప‌ద సంఘ‌ట‌న చోటుచేసుకుంది. కైల్ జెమీసన్ (ఢిల్లీ పేసర్) బౌలింగ్‌లో రాజస్థాన్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని (4 పరుగులు) క్లీన్ బౌల్డ్ చేశాడు.అయితే, ఔట్ చేసిన తర్వాత జెమీసన్ చాలా అగ్రెసివ్‌గా సెలబ్రేషన్స్ చేసుకోవడంపై వివాదం నెలకొంది.

ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు దిల్లీ క్యాపిటల్స్ పేసర్ కైల్ జెమీసన్‌కు బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాకుండా ఒక డీమెరిట్ పాయింట్‌ను విధించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన తర్వాత జెమీసన్ అగ్రెసివ్‌గా ప్రవర్తించాడు. ప్రత్యర్థి ఆటగాడిని రెచ్చగొట్టేలా, అవమానించేలా ప్రవర్తించడం ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.5 ప్రకారం నేరం కావడంతో మ్యాచ్ రెఫరీ రాజీవ్ సేథ్ ఈ శిక్షను ఖరారు చేశారు. జెమీసన్ తన తప్పును ఒప్పుకోవడంతో పాటు ఈ జరిమానాను అంగీకరించినట్లు సమాచారం.