డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

19 వరకు జరుగనున్న సెషన్స్

ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం 19 రోజులు సమావేశాలు జరుగనున్నాయి. ఈ తేదీలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజూ శనివారం అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సమావేశాలకు ఆమోదం తెలిపారని కేంద్రమంత్రి తెలిపారు. దీనికి సంబంధించి రిజిజూ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.

మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగే నిర్మాణాత్మక, అర్థవంతమైన సమావేశాల కోసం తాను ఎదురుచూస్తున్నానని మంత్రి అన్నారు. ఈ సెషన్ లో కీలక బిల్లులు, ఆర్థికాంశాలపై చర్చలు, ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. ప్రతిపక్షాలు అనేక అంశాలపై కేంద్రానికి లోతైన ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. గత సమావేశాల్లో లాగానే ఈసారి కూడా సమావేశాల్లో రాజకీయ వేడి రగిలే అవకాశం ఉంది. ఈ శీతాకాల సమావేశాలు 18వ లోక్‌సభకు మరింత కీలకమని, ప్రజల సమస్యలు, దేశ అభివృద్ధి అంశాలపై చర్చ జరిగి, కొత్త చట్టాలు రూపొందే అవకాశం ఉందని రిజిజూ తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు సఫలం కావాలని, ప్రజలకు మేలు చేకూర్చాలని ఆశిస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఈ సందర్భంగా ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Leave a Reply