ఘ‌నంగా సీఎం రేవంత్ జన్మదినం

జగిత్యాల జిల్లా గొల్లపెల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి 56వ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాల‌తో క‌లిగి ఉంటూ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని కోరారు. ఆయ‌న సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్, వైస్ చైర్మన్ రాజిరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గౌతమ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు , సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.