నవీన్ యాదవ్‌కి మద్దతుగా…

నవీన్ యాదవ్‌కి మద్దతుగా…

మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం


జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడా డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కి మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యూసుఫ్‌గూడా డివిజన్‌లోని వెంకటగిరి వాటర్‌ నుంచి కృష్ణనగర్ బీ-బ్లాక్, యూసుఫ్‌గూడా చెక్‌పోస్ట్ వరకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, శివసేన రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ప్రచారం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతి ఓటరితో ఆప్యాయంగా మాట్లాడి, నవీన్ యాదవ్‌కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం శ్రీకృష్ణనగర్ (Srikrishnanagar) లో స్థానిక నాయకులతో కలిసి పిల్లి పద్మ ఆంజనేయులు యాదవ్ నివాసంలో భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం లబ్ధిదారుల ఇళ్లలో పంపిణీ ఎలా జరుగుతోందో స్వయంగా తెలుసుకున్నారు.ఇంటి యజమాని పిల్లి పద్మ మాట్లాడుతూ, “గతంలో రేషన్‌ బియ్యం తినలేమనిపించేది, కానీ ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం చాలా మంచి నాణ్యతతో ఉంది. రేషన్‌ కార్డుల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాం, ప్రస్తుత ప్రభుత్వం వాటిని పంపిణీ చేయడంతో సంతోషంగా ఉంది” అని తెలిపారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ ఇళ్లు (Indiramma’s house), మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు వంటి సంక్షేమ పథకాలు ప్రజల జీవితాలను మెరుగుపరుస్తున్నాయని పేర్కొన్నారు. భోజనానికి ఆహ్వానించిన పిల్లి పద్మకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply