షూటింగ్ బాల్లో ప్ర‌తిభ‌

షూటింగ్ బాల్లో ప్ర‌తిభ‌

జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు యాదాద్రి జిల్లా విద్యార్థులు
మోత్కూర్, (ఆంద్రప్రభ) మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలంలో రాష్ట్ర స్థాయి జూనియర్ (అండర్ 19) షూటింగ్ బాల్ క్రీడోత్సవాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా బాల, బాలికల జట్టు ద్వితీయ స్థానం సాధించింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాగ్ 44 జాతీయ స్థాయి పోటీలకు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన క్రీడాకారులు జి భాను,సాయి,గణేష్ లు తెలంగాణ రాష్ట్ర స్థాయి జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యారని తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ గారవ అధ్య‌క్షుడు మోత్కూర్ యాదయ్య తెలిపారు. ఆలేరు సాంఘిక సంక్షేమ పాఠశాల కు చెందిన క్రీడాకారులు బి వసంత,జె లహరి చక్కటి క్రీడా బ్రతిభ కనబరిచి 44 వ జాతీయ స్థాయి షూటింగ్ బాల్ క్రీడోత్సవాలు నవంబర్ లో ఉత్తర్ ప్రదేశ్ లోనిస్ గజియా బాగ్ లో జరుగు పోటీలకు ఎంపికైనట్లు జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి మోత్కూర్ మానస తెలిపారు.

Leave a Reply